యంగ్ టైగర్ ఎన్టీఆర్-బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ ల కలయికలో దేవర నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ అప్ డేట్ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది. ఎన్టీఆర్ స్మార్ట్ గా, హ్యాండ్ సమ్ గా ఉండడం వారిని మరింతగా సంతోషపెట్టింది. జాన్వీ కపూర్ కూడా గ్లామర్ గా కనిపించడంతో సెకండ్ సింగిల్ పోస్టర్ వైరల్ అయ్యింది.
మరి ఒక హీరో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే వాళ్ళని ఎలా ట్రోల్ చెయ్యాలా అని చాలామంది ఇతర హీరోల అభిమానులు కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా ఆ హీరోల అభిమానుల నుంచి సెగ తగిలింది. దేవర సెకండ్ సింగిల్ పోస్టర్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.
ఎన్టీఆర్ కాలుకి జాన్వీ కపూర్ కాలు చుట్టుకుంది ఓకె. ఆ ఎన్టీఆర్ కాలు వెనుక జాన్వీ కాలు కనిపించాలిగా.. అది చూసుకోకపోతే ఎలా అని ఒకరు, జాన్వీ కపూర్ చేతికి నరాలు పైకి కనిపిస్తున్నాయి. హీరో మీద పెట్టిన శ్రద్ద హీరోయిన్స్ పై పెట్టరా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మగాధీరలో చరణ్-కాజల్ సాంగ్ పోస్టర్ ని దేవర ఎన్టీఆర్-జాన్వీ సాంగ్ పోస్టర్ ని పక్క పక్కన పెట్టి సేమ్ టు సేమ్ అంటున్నారు.
ట్రోల్ చెయ్యడానికి కూడా అర్ధముండాలి. జాన్వీ కపూర్ పాదం ఎన్టీఆర్ కాలు వెనుక కనిపిస్తుంది. సరిగ్గా చూడండి.. అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయా హీరోల ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. కావాలని మాట్లాడం తప్పితే ఆ పోస్టర్ లో పేరు పెట్టడానికి ఏముంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు చిందులు వేస్తున్నారు.