Advertisement
Google Ads BL

వల్లభనేని వంశీ అరెస్ట్


గన్నవరం వైసీపీ మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిన్న వంశీ ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి హైదరాబాద్ ఇంకా కొన్ని చోట్ల వంశీని అరెస్ట్ చేసేందుకు బయలు దేరారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71 ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
CJ Advs

అయితే వంశీని అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో వంశి అమెరికా పారిపోయాడంటూ ప్రచారం మొదలయ్యింది. 2024 ఎలక్షన్ లో వైసీపీ ఓటమి పాలవడంతో వల్లభనేని వంశీ మీడియా కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. మరోపక్క గన్నవరం టీడీపీ కార్యకర్తలు వంశీ ని అరెస్ట్ చెయ్యాలంటూ పోలీస్ లపై ఒత్తిడి తెస్తున్నారు. 

అందులో భాగంగానే ఈ రోజు గన్నవరం దగ్గరలో పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీ కారుని ఫాలో అయిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

వంశీ ఈరోజు హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో గన్నవరం వస్తు్న్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా వంశీ వేరే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నాడని పోలీసులకు తెలియడంతో తెలివిగా వంశీ వాహనాన్ని ఫాలో అవుతూ ఆయన ఇంటి సమీపంలోనే వంశీ ని అరెస్ట్ చేసి గన్నవరం పీఎస్ కి తరలించారు.  

Vallabhaneni Vamsi Arrest:

 Vallabhaneni Vamsi Arrested At Gannavaram In Tdp Office Attack Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs