యంగ్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా మొదలు పెడతాడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా ఫిలిం ఫినిష్ చెసే పనిలో తల మునకలై ఉండడమే కాదు.. ఈ నెల రెండో వారంలో ఎన్టీఆర్ వార్ 2 లాంగ్ షెడ్యూల్ కోసం ముంబై వెళుతూ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.
ఎందుకంటే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఆగష్టు నుంచి మొదలవుతుంది అన్నప్పటికీ అటు వైపుగా ఎన్టీఆర్ అడుగులు వేయకపోవడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారట.
సెప్టెంబర్ లో ఎన్టీఆర్-నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ అప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్-నీల్ కాంబో పై భీభత్సమైన అంచనాలున్నాయి. ఫ్యాన్స్ కి, పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్, ఎమోషన్స్ ను ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే చిత్రంలో చూపించబోతున్నారట. మరి ఇవన్నీ వింటూ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చ హాపీనే..!