Advertisement
Google Ads BL

బిగ్ ట్విస్ట్: రాజ్ తరుణ్ నాకొద్దు: లావణ్య


గత నెల రోజులుగా హీరో రాజ్ తరుణ్ విషయంలో లావణ్య మీడియాలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లి చేసుకుని, అబార్షన్స్ చేయించాడు, ఇపుడు తనని వదిలేసి వేరే హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడు, నా రాజ్ నాకు కావాలని నానా యాగీ చేసిన కావణ్య యూటర్న్ తీసుకుంది. తనకి రాజ్ తరుణ్ వద్దు, నేను కావాలనుకుంటున్న రాజ్ తరుణ్ నన్ను అర్ధం చేసుకోవడం లేదు, రాజ్ తరుణ్ పదే పదే మాకు పెళ్లి కాలేదు అని వాదిస్తున్నాడు. నేను అలాగే అనుకుంటాను. కానీ పెళ్లి కాకుండా 11 ఏళ్ళు ఎలా కలిసి ఉన్నాడు అంటూ లావణ్య ట్విస్ట్ ఇచ్చింది. 

Advertisement
CJ Advs

రెండు రోజుల క్రితం రాజ్ తరుణ్ ని కలవాలంటూ ప్రసాద్ ల్యాబ్ దగ్గర రచ్చ చేసిన లావణ్య ఆ తర్వాత మాదాపూర్ లోని రాజ్ తరుణ్ ఇంటి ముందు కూడా రచ్చ చేసింది. దానితో రాజ్ తరుణ్ తల్లితండ్రులు లావణ్య పై పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టారు. అటు రాజ్ తరుణ్ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టుని ఆశ్రయించాడు. ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ నాకొద్దు అంటూ లావణ్య ట్విస్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

నాలుగు గోడల మధ్యన జరిగిన గొడవను నేను వీధి మీదకి తీసుకోచ్చాను, నాకు హెల్ప్  చేస్తారనుకున్నాను, ఎవ్వరు సహాయం చెయ్యలేదు. నేను రాజ్ తరుణ్ ని ఎక్కడా తప్పుగా చూపించలేదు. కానీ రాజ్ మాత్రం తన ఫ్రెండ్ శేఖర్ బాషా తో కలిసి నాపై చాలా ఆరోపణలు చేసాడు. అవి నన్ను బాధించాయి. రాజ్ నాతో ఉండడానికి ఇష్టపడడం లేదు. అలాంటి రాజ్ నాకు వద్దు. 

నేను రాజ్ తరుణ్ తో 11 ఏళ్ళు కలిసి ఉన్నాను. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి రాజ్ ని కలవనివ్వమని గొడవ చేశాను. కానీ రాజ్ పేరెంట్స్ అది అర్ధం చేసుకోకుండా నాపై కేసు పెట్టారు. ఇక నేను ఈ గొడవలు పడలేను, నాకు రాజ్ వద్దు అంటూ లావణ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 

New Twist In Raj Tarun Lavanya Controversy:

 Raj Tarun - Lavanya Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs