టీడీపీ నుంచి వైసీపీ లోకి వెళ్లిన వల్లభనేని వంశీ తన ఫ్రెండ్ కొడాలి నాని ని చూసి రెచ్చిపోయి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల విషయం లో తన అనుచరులతో దాడులు చేయించడమే కాదు, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఘటనలో పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. అసెంబ్లీలో ప్రతి పక్షం పై రెచ్చిపోయిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే వరకు టీడీపీ కార్యకర్తలు నిద్రపోయేలా కనిపించడం లేదు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ దాడిలో నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఎమ్మెల్యే గా తన అనుచరుల ద్వారా టీడీపీ ఆఫీస్ పై దాడిచేసి విధ్వంసం సృష్టించారని పోలీసులు భావించడంతో వంశి పై కేసు నమోదు చేసారు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఫ్యామిలీ హైదరాబాద్ కి మకాం మార్చేసింది. ఆ తర్వాత వంశీ కూడా ఎవ్వరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉంటున్నాడు. కానీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వల్లభనేని వంశీని అరెస్ట్ చెయ్యాలని పోలీసులపై ఒత్తిడి తేవడంతో.. పోలీసులు వల్లభనేని వంశీ అరెస్ట్ కి రంగం సిద్ధం చేసారు.
అందులో భాగంగానే ఈ గురువారం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కి వెళ్ళాయి. వంశీ ఫ్యామిలీతో పాటుగా హైదరాబాద్ లోనే ఉండడంతో అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. అయితే ఎన్నికలలో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తనపై కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది అనే భయంతో అమెరికా వెళ్ళిపోయి ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.