Advertisement
Google Ads BL

సినిమా విడుదల: కోర్టును ఆశ్రయించిన హీరో !


సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అందులో నటించిన హీరో-హీరోయిన్స్, దర్శకనిర్మాతలకు ఎగ్జైట్మెంట్ తో పాటుగా చాలా టెన్షన్ కూడా ఉంటుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో, ఆడియన్స్ తమ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మొదటి షో పడి అది పూర్తయ్యేవరకు వారిలో ఆ టెన్షన్ పోదు. 

Advertisement
CJ Advs

అలాంటిది ఓ హీరో తన సినిమా విడుదలవుతుంటే ఆ టెన్షన్, ఆ సంతోషం అన్ని పక్కనపెట్టి కోర్టుకు వెళ్లబోతున్నాడు. మరి అంతకన్నా దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరేమో. అదే రాజ్ తరుణ్. మాజీ లవర్ లావణ్య విషయంలో టార్గెట్ అయిన రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి ఈ రోజు థియేటర్స్ లో విడుదలవుతుంది. 

అదే సమయంలో లావణ్య కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు రాజ్ తరుణ్ హై కోర్టు ను ఆశ్రయించబోతున్నాడు. లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసారు రాజ్ తరుణ్ ని విచారణకు రమ్మని పోలీసులు పిలవగా అతను తన లాయర్ తో రాలేనని చెప్పించాడు. దానితో రాజ్ తరుణ్ అరెస్ట్ ఖాయమని వార్తలొస్తున్నాయి. 

అందుకే రాజ్ తరుణ్ తనని పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టులో పిటిషన్ వెయ్యగా.. అది కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆ కేసుని ఈరోజు కి వాయిదా వేసింది. మరి సినిమా రిలీజ్ రోజే రాజ్ తరుణ్ ఇలా కోర్టు మెట్లు ఎక్కడమనేది నిజంగా విచారించదగిన విషయం. 

Raj Tarun Moves High Court Seeking Anticipatory Bail:

Raj Tarun seeks pre-arrest bail in high court
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs