ఈరోజు దర్శకుడు బాబీ బర్త్ డే. ఇండస్ట్రీ నుంచి కొల్లి బాబీ కి బిర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో సెలెబ్రిటీస్ ట్వీట్స్ వేస్తున్నారు. ఆయనతో పని చేసిన హీరోలు, హీరోయిన్స్, నటులు అంతా బాబీ ని విష్ చేసిన వారిలో ఉన్నారు. దర్శకుడు బాబీ ప్రస్తుతం నందమూరి నటసింహ బాలయ్య తో NBK 109 ని తెరకెక్కిస్తున్నారు.
బాబీ బాలయ్యని మాస్ గా కాదు ఊర మాస్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే NBK 109 నుంచి వచ్చిన పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ అభిమానులను, మాస్ ఆడియన్స్ ని ఊపేసాయి. NBK 109లో బాలయ్య లుక్ చూసి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ పక్కా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.
తాజాగా NBK 109 సెట్స్ లో బాలయ్య కొత్త లుక్ బయటికి వచ్చింది. దర్శకుడు బాబీ ఇంకా బాలకృష్ణ కలిసి మాట్లాడుకుంటున్న పిక్ బయటికి రాగానే బాలయ్య అంటేనే మాస్, మాస్ అంటేనే బాలయ్య అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. బాబీ బర్త్ డే సందర్భంగా ఆయనకు బాలకృష్ణ విషెస్ చెబుతున్నారేమో అంటూ నెటిజెన్స్ కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు.