శ్రీ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి అవసరం లేని పేరు. అలాగని ఎవరికీ అవసరం లేదు అనుకోండి. కానీ కొన్నిసార్లు సంభోదించక తప్పదు కూడా. సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రాక ఒంటరిగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వంట వీడియోస్ చేసుకుంటున్న శ్రీరెడ్డి ఉన్నట్లుండి జగన్ పై, వైసీపీ ప్రభుత్వం పై ప్రేమ ఒలకబోసింది. అంతే టీడీపీ, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ప్రతి ఒక ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి వైసీపీ కి సపోర్ట్ చేస్తూ విచ్చలవిడి కామెంట్స్ చేసింది.
వైసీపీ సోషల్ మీడియా శ్రీరెడ్డి కి జీతం ఇచ్చిందో, లేదో కానీ శ్రీరెడ్ది మాత్రం వైసీపీ కోసం ప్రాణం పెట్టి పని చేసింది. జగన్ అన్నా అంటూ జగన్ గెలుస్తాడనుకుని టీడీపీ వాళ్ళను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేది. కానీ వైసీపీ ఓడిపోయింది. దానితో ఆమెకు వైసీపీ సోషల్ మీడియా పేమెంట్ ఆగిపోయినట్లుగా ఉంది. ఓడిపోయాక వైసీపీ నేతలను కూడా విమర్శించింది.
ఇప్పుడు శ్రీరెడ్డి కి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించక్కర్లేదు. టీడీపీ అభిమానులే ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీరెడ్డి చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత లపై చేసిన కామెంట్స్ పై టీడీపీ వాళ్ళు కేసు పెట్టారు. అంటే శ్రీరెడ్డి అరెస్ట్ తద్యమంటూ వార్తలు రావడం శ్రీరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లపోవడం జరిగింది. ఈమధ్యన తాను దొరక్కుండా ఉండాలని పూజలు చేయించింది అన్నారు. ఇప్పుడు శ్రీ రెడ్డి తనని అమ్మవారే కాపాడాలంటూ మాట్లాడుతుంది.
తాను మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యానని, తనని ఇక ఆ భద్రకాళీ అమ్మవారే కాపాడాలి అంటూ ఓ సూసైడ్ నాట్ పోస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం. ఇంకా ఎన్నిరోజులు బతుకుతానో తెలియదు, ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా అనిపించవచ్చు.. కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉంది అని శ్రీరెడ్డి రాసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.