మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో తండ్రి మరణం తర్వాత చిరు ఆయన స్థానంలోకి ఎక్కడ వస్తారో అని నయన్ భర్త సత్యదేవ్ పావులు కదుపుతూ ఎమ్యెల్యేలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయం చేస్తాడు. అలా తనకు అందరి ఎమ్యెల్యే ల సపోర్ట్ ఉంది అనుకున్న క్షణంలో చిరు కి విధేయత చూపించే ఎమ్యెలు ఒక్కొక్కరిగా సత్యదేవ్ కి ట్విస్ట్ ఇవ్వడం గాడ్ ఫాదర్ చిత్రంలో హైలెట్ అవుతుంది.
ఇప్పుడు గాడ్ ఫాదర్ కథ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో గత పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అండ్ బీఆరెస్ పార్టీ ఓడిపోయి, ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఓటమి బాధతో ఉన్న కెసిఆర్ కి ఆ వెంటనే కాలు ఫ్రాక్చర్ కావడం, తిరిగి కోలుకుని పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసి జీరో స్థానాలతో ఢీలా పడింది.
పుండు మీద కారం జల్లినట్టుగా BRS నుంచి కొంతమంది ఎమ్యెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. చాలామంది తెరాస ఎమ్యెల్యేలు కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనుకున్న సమయంలో కాంగ్రెస్ లోకి వచ్ఛినట్టే వచ్చి మళ్ళీ BRS లోకి వెళ్ళిపోయి ఒక ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి కి ట్విస్ట్ ఇచ్చారు.
రేవంత్ కి షాకిచ్చి ఆ ఎమ్యెల్యే కేసీఆర్ కి విధేయత చూపడా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం అంటే కావాలనే BRS నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారా, లేదంటే పదవలు ఆశించి పని జరగక కాంగ్రెస్ నుంచి BRSలోకి వచ్చి పరువు నిలుపుకోవాలనుకుంటున్నారా, ఏది ఏమైనా చిరు గాడ్ ఫాదర్ సీన్ అయితే తెలంగాణ రాజకీయాల్లో కనిపించడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది.