రేవ్ పార్టీల విషయంలో పోలీసులు ఎంతగా టార్గెట్ చేస్తున్నా సెలబ్రిటీస్ మాత్రం రేవ్ పార్టీలు నిర్వహణలో వెనకడుగు వెయ్యడం లేదు. రీసెంట్ గానే బెంగుళూరు రేవ్ పార్టీ ఎంత సంచలనాన్ని సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు. నటి హేమ తో పాటు గా పలువురు సెలబ్రిటీస్ ఈ కేసు లో ఇరుక్కున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ హైదరాబాద్ సమీపంలో నిర్వహించిన రేవ్ పార్టీ విషయం కాస్త లేట్ గా తెర పైకి వచ్చింది.
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ తన బర్త్ డే సందర్భంగా జులై 29 న మేడ్చల్, ఘాట్ కేసర్ లోని అంకుసాపూర్ కాంటినెంట్ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంస్ట్, మెహబూబ్ ఫ్రెండ్స్, బుల్లితెర నటులైన గీతూ రాయల్, సత్య, ఢీ ఫేమ్ శ్వేతా నాయుడు, శివ జ్యోతి భర్త గంగూలీ, యాంకర్ ధనుష్ లాంటి వాళ్ళు ఈ పార్టీకి హాజరైన వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
కాంటినెంట్ రిసార్ట్స్ లో లిక్కర్ పార్టీ జరుగుతుంది అనే సమాచారంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చెయ్యగా.. అక్కడ పలు బ్రాండ్స్ కి చెందిన మద్యం బాటిల్స్ ని పోలీసులు సీజ్ చెయ్యడంతో పాటుగా ఆ రిసార్ట్ మేనేజర్ ని అలాగే సూపర్ వైజర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఈ పార్టీలో మాదక ద్రవ్యాల ఎమన్నా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టనట్టుగా తెలుస్తుంది.