Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ కి సూపర్ హైప్ ఇచ్చిన రాజీవ్


రామ్ చరణ్-శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ లో విడుదల అంటూ మెగా ఫ్యాన్స్ ని దిల్ రాజు చల్లబరిచారు. కానీ మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఇండియన్ 2 డిజాస్టర్ భయం అలానే ఉంది. శంకర్ గేమ్ ఛేంజర్ పై భరోసా ఇస్తున్నా వారిలో ఆ టెన్షన్ తీరడం లేదు. అయితే ఆ చిత్రంలో నటించిన రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచే కామెంట్స్ చేసాడు. 

Advertisement
CJ Advs

గేమ్ ఛేంజర్ పై ఇండియన్ 3 ఎఫెక్ట్ ఎమన్నా ఉంటుందా అని అడిగితే.. ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద అస్సలు ఉండదు. గేమ్ ఛేంజర్‌లో బ్రహ్మాండమైన పవర్ ఫుల్ సీన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆయన ఒక నిధి. పద్మనాభ స్వామి ఆలయంలో బయటికి తీసిన మాళిగల్లో ఈయన ఒక మాళిగ. కాబట్టి ధనం వస్తూనే ఉంటుంది. 

శంకర్ సర్ గేమ్ ఛేంజర్‌ సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్న ప్రకారం గేమ్ ఛేంజర్ లోని ఒక్కో సాంగ్ రూ.10 కోట్లు, రూ.12 కోట్లు ఖర్చు అయ్యాయి. శంకర్ గారి సాంగ్స్ అంటేనే ఆ రిచ్‌నెస్ ఉంటుంది. అంత భారీగా ఉంటాయి గేమ్ ఛేంజర్  సాంగ్స్.. అంటూ రాజీవ్ కనకాల చేసిన కామెంట్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఏం హైప్ ఇచ్చావ్ అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు.  

ఇక నేడు కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్ గా గేమ్ ఛేంజర్ నుంచి కియారా అద్వానీ లుక్ వదిలారు. అది జరగండి సాంగ్ లో కియారా గెటప్ లుక్. ప్రస్తుతం ఈ అప్ డేట్ ని మెగా అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. 

Rajeev Kanakala gave super hype to the Game Changer:

Game Changer songs update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs