Advertisement
Google Ads BL

ఆగస్టు 2: థియేటర్స్ లో చిన్న సినిమాల జాతర


కల్కి ప్రభంజనం తర్వాత ప్రేక్షకులను భారతీయుడు 2 బాగా నిరుత్సాహపరిచింది. ఆ తర్వాత చిన్న సినిమాల హడావిడి థియేటర్స్ లో నడుస్తుంది. గత వారం లాగే ఈ వారం కూడా పొలోమంటూ చిన్న సినిమాలు థియేటర్స్ దగ్గర పోటీపడుతున్నాయి. ఒకటి కాదు రెండు చాలా సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

Advertisement
CJ Advs

అందులో ఈమధ్యన హిడింబ తో ఆకట్టుకున్న అశ్విన్ బాబు శివం భజే అంటూ ఆగస్ట్ 1 గురువారమే ఆగష్టు నెల కి బోణి కొడుతున్నాడు. మైథలాజి ముడిపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ గా శివమ్ భజే ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇక సక్సెస్ పరితపిస్తున్న మెగా హీరో అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసీవో తర్వాత బడ్డీ చిత్రంతో ఆగష్టు 2 శుక్రవారం ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ పరంగా నాకు పిఆర్ టీమ్ లేదు అంటూ ఆసక్తిగా ఆకట్టుకుంటున్నాడు. 

పురుషోత్తముడు డిజ్ పాయింట్ తర్వాత వెంటనే మరో చిత్రంతో రాజ్ తరుణ్ రాబోతున్నాడు. శుక్రవారం ఆగస్టు 2 న తిరగబడరా సామి చిత్రం విడుదలవుతుంది. ఇక బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని తుఫాన్ కూడా ఆగష్టు 2 రేస్ లో ఉంది. ఉషా పరిణయం, వరుణ్ సందేశ్ విరాజి, అలనాటి రామచంద్రుడు లాంటి చిన్న సినిమాలు ఆగష్టు 2 న థియేటర్స్ లో పోటీకి దిగాయి. 

మరి ఆగస్టు ని చిన్న సినిమాలు జాతరలో స్టార్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాల్లో ఏవి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయో అనేది మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

August 2: Small films in theatres:

August 2: Everything Releasing This Week In Theatres
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs