Advertisement

నాగబాబు ని అడ్డంగా ఇరికించిన నిహారిక


కమిటీ కుర్రాళ్ళు నిర్మాతగా నిహారిక మీడియా లో బాగా హైలెట్ అయ్యేలా ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ అంటూ చాలా హడావిడి చేస్తుంది. అసలే డిప్యూటీ సీఎం గారి తాలూకా ఆయే.. ఆ మాత్రం అటెన్షన్ ఉండదా. ఇక ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మీడియా ముందుకు వస్తున్న నిహారిక కొణిదెల ఓ ఇంటర్వ్యూలో తండ్రి నాగబాబు ని అడ్డంగా ఇరికించింది.

Advertisement

అటు సినిమాలు, వెబ్ సిరీస్ లు మధ్యలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా జనసేన బాధ్యతలతో నాగబాబు ఫుల్ బిజీ. అయితే నాగబాబు అల్లు అర్జున్ విషయంలో కోపంగా ఉన్నారు, ఆయన అల్లు అర్జున్ నంద్యాల పొలిటికల్ టూర్ పై ఆగ్రహంతో ఉండి అల్లు అర్జున్ ని ఉద్దేశించి వేసిన ట్వీట్ వైరల్ అవ్వగా.. అల్లు ఫ్యాన్స్ ట్రోల్ కి భయపడి ఆ ట్వీట్ డిలేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

అదే విషయం అంటే.. మీ ఫ్యామిలీలో అందరూ మీ తండ్రి, బాబాయ్ కి సపోర్ట్ చెయ్యాలేదనే డిస్పాయింట్మెంట్ ఉందా.. మీ నాన్నగారు అల్లు అర్జున్ పై కోపంగా ఉన్నారా అడగగా.. దానికి నిహారిక.. మా నాన్న చాలా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో ఏవో పోస్ట్ లు చేస్తూ ఉంటారు. ట్విట్టర్ మాత్రమే కాదు మా నాన్న వాట్స్ ఆప్ చూసినా రోజు ఏదో సోది, సుత్తి పెడుతూ ఉంటారు. ఇదిలా అదిలా అంటూ, ఆ టాపిక్ గురించి ఇంట్లో ఎప్పుడు డిస్కర్షన్ జరగలేదు అని నిహారిక చాలా తేలిగ్గా చెప్పుకొచ్చింది.  

కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం మా నాన్న చెప్పేది, రాసేది అంతా సుత్తి అంటున్న నాగబాబు కూతురు, ఆ సుత్తి నమ్మే వాళ్ళు  - జన సైనికులు 😔అంటూ నిహారిక మాట్లాడిన వీడియో ని ట్యాగ్ చేస్తూ అప్పుడే నాగబాబు ని టార్గెట్ చేసేసింది. 

Niharika who crossed Nagababu:

YCP Social Media targets Nagababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement