పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ ని చాలా ఏళ్ళు వెయిట్ చేయించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ అనౌన్సుమెంట్ వచ్చాకే ఏడాదికి పైగా పవన్ కోసం హరీష్ వేచి చూసాడు. పవన్ వచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్క షెడ్యూల్ పూర్తి చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ దాదాపు ఏడాది కాలం పవన్ కోసం హరీష్ శంకర్ ఎదురు చూస్తూ ఉన్నాడు.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం, ఆయన గెలిస్తే పరిస్థితి ఏమిటి అన్న విషయంలో ఓ క్లారిటీ ఉన్న హరీష్ శంకర్ పర్ఫెక్ట్ గా మిస్టర్ బచ్చన్ ప్లానింగ్ చేసేసి రవితేజ ని లైన్ లో పెట్టేసి చకచకా సినిమాని పూర్తి చేసి ఆగష్టు 15 కి రిలీజ్ చేస్తున్నాడు. ఒకవేళ పవన్ ఆగస్టు తర్వాత వచ్చినా హరీష్ రెడీనే.
మిస్టర్ బచ్చన్ విడుదలైతే హరీష్ మళ్ళీ పవన్ కోసం వెయిట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. కానీ హరీష్ శంకర్ మాత్రం పవన్ ఇప్పుడప్పుడే వచ్చేలా లేరు, అందుకే తన నెక్స్ట్ హీరోగా రామ్ ని సెలెక్ట్ చేసికుని ఆ విషయాన్ని ఓపెన్ గానే అందరి ముందు అనౌన్స్ చేసేసాడు. పవన్ కళ్యాణ్ పది, పదిహేను రోజులు డేట్స్ ఇస్తేనే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే కంటెంట్ ఇచ్చిన హరీష్ పై అందరి హీరోల అభిమానులకు నమ్మకం ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడొచ్చినా హరీష్ కి టెన్షన్ లేకుండా తన పని తాను చేసుకుంటూ బిజీ అవుతాడు. మిస్టర్ బచ్చన్ తరవాత ఉస్తాద్ విషయం ఎలా ఉన్నా రామ్ తో మూవీ స్టార్ట్ చేసేస్తాడన్నమాట.