ఆగష్టు 15 గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతూ సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీకి మిస్టర్ బచ్చన్ రూపంలో ఆపద పొంచి ఉంది. మరోపక్క లైగర్ ఇష్యు సమసిపోయింది అని పూరి జగన్నాధ్, ఛార్మీలు రిలాక్స్ అవుతున్నారు. నైజాం లో లైగర్ నష్టాలేవి బయ్యర్లకు చెల్లించక్కర్లేదు అని ఫిలిం ఛాంబర్ పూరి కి చెప్పడంతో వారు కాస్త తెలియపడ్డారు.
కానీ ఇప్పుడు అదే ఇష్యుతో అంటే లైగర్ కి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ డబుల్ ఇస్మార్ట్ కి ఇబ్బందులు సృష్టించేలా కనబడుతుంది వ్యవహారమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. నైజాం థియేటర్ ఓనర్స్ డబుల్ ఇస్మార్ట్ ని తమ థియేటర్స్ లో విడుదల చేయకుండా పూరి జగన్నాధ్, ఛార్మీలను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నారు.
లైగర్ నష్టాలతో అతలాకుతలమైన బయ్యర్లు డబుల్ ఇస్మార్ట్ ని తమ థియేటర్స్ లో విడుదల చెయ్యకూడదని, తమకి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లిస్తేనే కానీ పూరీని, ఛార్మిని వదలమని వారు మాట్లాడుతున్నట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓ వర్గం అంటే మిస్టర్ బచ్చన్ కి కావాల్సిన వారు డబుల్ ఇస్మార్ట్ పై అంత బజ్ లేదు, పాటలతో క్రేజ్ రాలేదు, ట్రైలర్ వస్తే కానీ దాని బండారం బయటపడదంటూ నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.
మరి ఈ విషయంలో పూరి ఇంకా ఛార్మి లు ఏం చేస్తారో అనేది రామ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది.