కింగ్ ఖాన్ షారుఖ్ ఆ మధ్యన ఐపీఎల్ అప్పుడు స్టేడియం లో కళ్ళు తిరిగిపడిపోయి డీహైడ్రేషన్ కి గురై ఆసుపత్రిలో చేరిన ఆయన త్వరగానే కోలుకుని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో హుషారుగా కనిపించడమే కాదు ఈ ఏడాది ఐపీఎల్ కప్ పట్టుకుపోయిన షారుఖ్ అండ్ టీమ్ చాలా హ్యాపీగా ఉంది.
ఈమధ్యన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అనే టాక్ ఉంది. ఈ సమయంలో షారుఖ్ ఆరోగ్యం కోసం అమెరికాకు వెళ్ళబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ కంటి సమస్యతో బాధపడుతున్నారట. దీని కోసం ముంబై కంటి ఆసుపత్రిని సంప్రదించగా షారుఖ్ కన్ను కి ఆపరేషన్ అవసరం అని చెప్పినట్లుగా సమాచారం. అందుకే బెటర్ ట్రీట్మెంట్ కోసం షారుఖ్ అమెరికా వెళ్లాలను డిసైడ్ అయినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
2014 లో షారుఖ్ కి ఓసారి కంట్రీకి ఆపరేషన్ జరిగింది. మళ్ళి పదేళ్లకు ఆ సమస్య తిరగబెట్టడంతో షారుఖ్ హుటాహుటిన అమెరికా బయలుదేరుతున్నారట. ఆయన వెంట ఆయన భార్య గౌరీ ఖాన్, కొడుకు ఆర్యన్ కూడా అమెరికా పయనమవుతున్నట్లుగా టాక్. అక్కడికి వెళ్ళగానే షారుఖ్ ఇమ్మిడియట్ గా కంటికి ఆపరేషన్ చేయించుకుంటారని తెలుస్తోంది.