హీరో ధనుష్ వరసగా సినిమాలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉన్నాడు. సినిమా ప్లాప్ అయ్యింది కదా అని దిగులు పడి డిప్రెషన్ లోకి వెళ్ళడు, సినిమా హిట్ అయ్యింది కదా అని ఏ వెకేషన్స్ ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడు. సినిమాలే ప్రపంచం అన్నట్టుగా తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ భాషలో అయినా ధనుష్ దూరిపోతాడు. తాజాగా ధనుష్ నటించిన రాయన్ మూవీకి తమిళనాట హిట్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అయితే సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాలను వీక్షించడమే కాదు.. ఆ సినిమాపై తన అభిప్రాయాలను, టీమ్ ని అప్రిషేట్ చేస్తూ ట్వీట్స్ వెయ్యడం చూస్తూనే ఉన్నాము. తాజాగా మహేష్ రాయన్ మూవీ చూసి సోషల్ మీడియా వేదికగా ధనుష్ అండ్ టీమ్ ని ప్రశంసించడం ధనుష్ అభిమానులను హ్యాపీ ఫీలయ్యేలా చేసింది.
#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch… Congratulations to the entire team! @sunpictures @officialdushara @varusarath5 @kalidas700 @Aparnabala2 @selvaraghavan
అంటూ పేరు పేరునా మహేష్ ప్రశంసించడం అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది. సూపర్ స్టార్ అయ్యుండి తమ హీరోని అంతలా పొగడడం మాత్రం ధనుష్ అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసింది.