జగన్ ప్రభుత్వం ఒక రోడ్డు వెయ్యలేదు, ఒక అభివృద్ధి చెయ్యలేదు, ఏది లేదు. కేవలం ఓటు బ్యాంకు కోసం వృద్దులకి, మహిళలకి, పేదవారికి బ్యాంకు లో డబ్బులు వేస్తూ ఆ పథకాలు, ఈ పథకాల పేర్లు చెప్పి వారిని గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నమైతే గట్టిగానే చేసారు. జగన్ కేవలం వీటి మీదే ఫోకస్ పెట్టాడు కానీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళదామని ఆలోచించలేదు. అమరావతి రాజధాని అంటే ఒప్పుకోలేదు.
అక్కడ భూముల రేట్లు విచ్చల విడిగా పెరగడం చూసి అమరావతి ఒకటే కాదు మూడు రాజధానుల నినాదం ఎత్తుకుని ఏ రాజధానిని డెవలప్ చెయ్యకుండా కేవలం పథకాలు వెంట పరుగులు తీసాడు. ఇప్పుడు జగన్ ని ఆ పథకాలే ముంచేసాయి. ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నంలో రాష్ట్రాన్ని గాలికొదిలేసిన జగన్ ని ప్రజలు కూడా నిజంగానే గాలికి వదిలేసి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.
మరి ఇప్పుడు ఓడిపోయిన జగన్ ని ఆయన సోషల్ మీడియా ఎత్తే ప్రయత్నం చెయ్యడం అటుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి చేసుకోని కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతుంది. వంట పాత్రనే తెప్పగా వాడి వృద్ధురాలిని వాగు దాటించిన అల్లూరి పాడేరు జిల్లా జామిగూడ గిరిజనులు. అమరావతి కోసం వేల లక్షల కోట్ల అప్పులు, మరి వీళ్ళ కోసం? ఏం ఇస్తారు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది.
సరే రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో, చేస్తుందో అందరూ చూస్తున్నారు. అప్పుడే అమరావతి కోసం కేంద్రం నుంచి ఎంతోకొంత రాబట్టారు. చంద్రబాబు సీఎం అయ్యారు, అకాల వర్షాలు. జగన్ ప్రభుత్వంలో రోడ్లు వెయ్యకుండా ఒదిలెయ్యడంతో ఆరోడ్లన్నీ ఇపుడు చెరువులను తలపిస్తున్నాయి. మరి జగన్ ఎంతోకొంత రాష్ట్రం మంచి గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకోకపోతే ప్రశ్నించాలి కాని.. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే మీరేం చేసారు అనే ప్రశ్నించే ముందు మీ జగన్ ఏం మంచి చేసారో చెప్పమంటూ టీడీపీ సోషల్ ఇండియా ఎదురు దాడికి దిగింది.