నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడైతే తన లుక్ టెస్ట్ పిక్స్ ని వదిలాడో అప్పటినుంచి నందమూరి అభిమానులకు అస్సలు ఊపిరి ఆడడం లేదు. మోక్షజ్ఞ ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారికి మోక్షజ్ఞ న్యూ లుక్ మెస్మరైజ్ చేసింది.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకుడిగా హనుమాన్ తో అదరగొట్టిన ప్రశాంత్ వర్మ, నిర్మాతగా అక్క నందమూరి తేజస్విని ఫిక్స్. ఇక మోక్షజ్ఞ న్యూ మేకోవర్ పై సోషల్ మీడియాలో సూపర్ ఫీడ్ బ్యాక్ రావడంతో బాలకృష్ణ కొడుకుని హీరోగా లాంచ్ చేసే విషయంలో ముహూర్తం కూడా సెట్ చేసేసారట. హైదరాబాద్ వేదికగా మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమా పూజ కార్యక్రమాలు చెయ్యడమే కాదు.. దానికి డేట్ కూడా లాక్ చేసేసారట.
సెప్టెంబర్ 6న అతిరధ మహారథుల మధ్యన మోక్షజ్ఞ ని హీరోగా లాంచ్ చేసే ఏర్పాట్లను ఇప్పటికే మొదలు పెట్టేశారని, ఈవేడుకకి నందమూరి అభిమానులను కూడా సెలెక్టెడ్ గా ఆహ్వానిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇది నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ కదా..!