Advertisement
Google Ads BL

వయసొచ్చింది.. ఇకపై ఆ పని చెయ్యను: విశ్వక్


విశ్వక్ సేన్ సినిమాల విషయంలో కన్నా సోషల్ మీడియాలో హైలెట్ అయిన హీరో. ఎప్పుడు వివాదాలకు దగ్గరగా వుండే విశ్వక్ సేన్ ఏ సినిమా విడుదల చేసినా దాని పబ్లిసిటీ కోసమో.. లేదంటే అతని తత్వమే అంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో అతనేం పోస్ట్ వేసినా అది కాంట్రవర్సీ అయ్యి కూర్చుంటుంది. అర్జున్ సినిమా అవ్వనివ్వండి, గతంలో విజయ్ దేవరకొండ పై చేసిన కామెంట్స్ కానివ్వండి, బేబీ దర్శకుడితో ఈగో ప్రోబ్లెంస్ అయినా ఇలా చాలా విషయాల్లో విశ్వక్ సేన్ పేరు కాంట్రవర్సి అయ్యింది. 

Advertisement
CJ Advs

ఈమధ్యన విశ్వక్ సేన్ సోషల్ మీడియా అందులోను పాపులర్ ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నాడు. దానితో విశ్వక్ సేన్ పై అపోహలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఏది ఏమైనా విశ్వక్ సేన్ మాత్రం సోషల్ మీడియా గురించి పట్టించుకోకుండా తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు. తాజాగా మెకానిక్ రాఖీ గ్లిమ్ప్స్ రిలీజ్ ఈవెంట్ లో తానెందుకు ఇన్స్టాగ్రామ్ కి దూరంగా ఉంటున్నాడో చెప్పుకొచ్చాడు. 

తనకి ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చేశాయని, ఇప్పటికి ఫోన్ లు వేసుకుని ఎక్కువసేపు టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే ఎక్కువ పని చేయలేమని, ఇకపై ఎక్కువ పని చెయ్యాలని ఉంది, అందుకే సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయానని, కానీ నేను నటించిన సినిమా రిలీజ్ వారం ముందు ఇన్స్టా లోకి వస్తా.. విడుదలయ్యాక వారం తర్వాత మళ్ళీ ఇన్స్టా నుంచి వెళ్ళిపోతాను అంటూ విశ్వక్ అసలెందుకు సోషల్ మీడియా నుంచి వెళ్లాల్సి వచ్చిందో సిల్లీగా చెప్పుకొచ్చాడు. 

Vishwak Sen is open about his exit from social media:

Vishwak Sen Cleared About His Absence From Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs