Advertisement
Google Ads BL

జగన్ ని అలా తగులుకున్నావేంటమ్మా..

jagan | జగన్ ని అలా తగులుకున్నావేంటమ్మా..

పాపం జగన్.. చెల్లి షర్మిల జగన్ ని వదలడం లేదు. పదే పదే జగన్ ని తగులుకుని తెగ విమర్శించేస్తుంది. అన్న మీద అంత కోపమెందుకు షర్మిలమ్మా అన్నా వినడం లేదు. మీడియా ముందు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అన్న జగన్ పై ఘాటైన వ్యాఖ్యలతో జగన్ కి నిద్ర లేకుండా చేస్తుంది. నీ హత్యా రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎందుకు మద్దతు నివ్వాలి అని నిన్న సోషల్ మీడియా వేదికగా జగన్ ని చీల్చి చెండాడిన షర్మిల నేడు అన్న అసెంబ్లీకి రాకుండా నాటకాలాడుతున్నాడంటూ విరుచుకుపడింది. 

Advertisement
CJ Advs

సిగ్గు సిగ్గు!!  మాజీ ముఖ్యమంత్రి @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం. 

MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly. 

ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా?

ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని... నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే... తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!! 

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు.

అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని @INC_Andhra కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.. అంటూ షర్మిల చేసిన ట్వీట్ చూసి జగన్ కి పరువు పోవడం ఖాయం అంటూ అధికార పక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. 

YS Sharmila Sensational Tweet On YS Jagan:

If you do not go to the assembly, you will go to the forests of Africa: Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs