ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్, ట్రెడిషనల్ డ్రెస్సులతో ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ కొద్దిరోజులుగా తన లుక్ మాత్రం మొత్తం మార్చేసింది. గ్లామర్ లుక్ లోకి మారిపోయింది. బోల్డ్ కేరెక్టర్స్ చేస్తుంది. ఈ ఏడాది టిల్లు గాడి గర్ల్ ఫ్రెండ్ గా సునామి సృష్టించిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చేతినిండా సినిమాల్తో కళకళలాడుతుంది.
వరస సినిమాల్తో బిజీగా మారిన అనుపమ పరమేశ్వరన్ అవకాశం వచ్చినప్పుడల్లా కొత్త ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ తో టూ మచ్ గ్లామర్ షో చేసిన ఫొటోస్ వదిలింది. అలాగని అందాలుఓ అన్నంతగా చూపించడం లేదు. కానీ ఆ గ్లామర్ మాత్రమే అనేంతగా హైలెట్ అయ్యింది.
సైడ్ లుక్స్ ఏమిటి స్ట్రయిట్ లుక్ కూడా యూత్ ని పడేసేలా చేసింది. కర్లీ హెయిర్ తో అనుపమ పరమేశ్వరన్ కత్తిలాంటి ఫోజులతో కిల్లింగ్ లుక్స్ తో పడేసేలా కనిపించింది. ప్రస్తుతం అనుపమ గ్లామర్ పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి.