దేవర బ్యూటీ దేవకన్యే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీ కపూర్ ని అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియా క్వీన్ కాస్తా సౌత్ పాన్ ఇండియా స్టార్స్ తో మూవీ ఆఫర్స్ పట్టేసి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క సినిమా కూడా విడుదలవ్వలేదు. మరో భారీ బడ్జెట్ మూవీలో ఆఫర్ దక్కించుకోవడంతో జాన్వీ కపూర్ లక్కీ హీరోయిన్ గా మారింది.
సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ డ్రెస్సులకు ఇంపార్టెన్స్ ఇచ్చే జాన్వీ కపూర్ వాటితో అందాలు ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఆమె ట్రెడిషనల్ వేర్ లో చాలా అరుదుగా కనిపించేది. డివోషనల్ అంటే గుడులకు గోపురాలకు వెళ్ళినప్పుడు మాత్రం చక్కటి లంగావోణీ, అందమైన చీర కట్టుతో కనిపిస్తుంది.
తాజాగా జాన్వీ కపూర్ మోడ్రెన్ డ్రెస్ పిక్స్ వదిలింది. అందులో ఆమె అందాలు సరిగ్గా కనిపించకపోయినా మత్తెక్కించే చూపులతో నిజంగా సూపర్బ్ గా ఆకట్టుకుంది. ఫ్లోరల్ డ్రెస్ అలాగే చెక్స్ డ్రెస్ తో రెండు వేరియేషన్స్ ఉన్న లుక్స్ తో జాన్వీ గమ్మత్తుగా కనిపించింది.