Advertisement
Google Ads BL

బ్యాక్ టు బ్యాక్ సినిమాల విడుదల.. కానీ హీరో?


పాపం ఏ హీరో కి రాని దుస్థితి హీరో రాజ్ తరుణ్ కి వచ్చిపడింది. కెరీర్ లో సక్సెస్ లేక తెగ సతమతమవుతున్న రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు నిన్న శుక్రవారం విడుదలయ్యింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అనేది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక రేపు శుక్రవారం రాజ్ తరుణ్ నటించిన మరో మూవీ తిరగబడరా సామి విడుదల కాబోతుంది. ఎప్పుడో ఫినిష్ అయిన ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. చిన్న సినిమాలు అందులోను ప్లాప్ లో ఉన్న హీరోలు సినిమాలొస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి క్రియేట్ చెయ్యాల్సిన బాధ్యత హీరోదే. మీడియా ముందు హడావిడి చేస్తే క్రేజ్ కూడా వస్తుంది. 

అటు హీరోకి కూడా ప్రేక్షకుల మధ్యకు వస్తున్నాను అంటే కాస్త ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలైనా హిట్ అయ్యి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తాడు. కానీ హీరో రాజ్ తరుణ్ కి అలాంటి అవకాశం లేదు. ప్రస్తుతం పర్సనల్ ప్రోబ్లెంస్ తో మీడియా ముందుకు రాలేని పరిస్థితి.  

మీడియా ముందుకు వస్తే పర్సనల్ ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఆన్సర్ ఇవ్వాలి, అందుకే ప్రమోషన్స్ కి కూడా రాకుండా మొహం చాటేయాల్సి వచ్చింది. పాపం రాజ్ తరుణ్ అంటూ అందరూ అతని పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. 

Release of back to back movies.. but hero?:

Raj Tarun to have two releases in two weeks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs