Advertisement
Google Ads BL

పవన్ మాటిచ్చారు కానీ..


పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అలాగే ఇతర శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈమధ్యన భార్య అన్నా లెజెనోవా డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా సింగపూర్ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాల్లో బిజీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలంగా సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేసారు. 

Advertisement
CJ Advs

రాజకీయంతో బిజీ కావడం, ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం హోదా పొందడంతో పవన్ బాధ్యతలు పెరిగిపోయాయి. అటు తాను నటించాల్సిన సినిమాలు సగంలో సెట్స్ మీదున్నాయి. పవన్ వస్తేనే కానీ పని జరగదు. ఒక మూడు నెలలు పాటు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అప్పుడు వస్తాను అని పవన్ నిర్మొహమాటంగా చెప్పారు. 

మరి OG చిత్రాన్ని కంప్లీట్ చేస్తానని మాటిచ్చారని దానయ్య చెబుతున్నారు. అదే కాదు హరి హర వీరమల్లు కూడా పవన్ పూర్తి చేస్తారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ మంగళం పాడినట్లే అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాటిచ్చారు కానీ.. ఎప్పుడు సెట్స్ లోకి వస్తారో చెప్పలేరు. అందుకే దానయ్య-దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

ఒన్స్ పవన్ సెట్స్ లోకి వస్తే చకచకా OG ని పూర్తి చేసేలా సకల ఏర్పాట్లతో దర్శకుడు సుజిత్ కాచుకుని కూర్చున్నాడట. OG కి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది. అందుకే నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ ఆరాటం పవన్ రాక కోసం. 

Lets see when Pawan Kalyan will come..!:

Sujith waiting for Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs