Advertisement
Google Ads BL

అప్పుడు పూజ హెగ్డే - ఇప్పుడు భాగ్యశ్రీ


బాలీవుడ్ లో పూజ హెగ్డే చేసిన మొదటి సినిమా డిజాస్టర్ అయినా, టాలీవుడ్ లో చేసిన సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా.. దర్శకుడు హరీష్ శంకర్ టాలీవుడ్ కి మళ్ళీ తీసుకొచ్చి దువ్వాడ జగన్నాధం చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో పూజ హెగ్డే అందాలు హరీష్ చూపించినట్టుగా ఎవ్వరూ చూపించలేదు అనే చెప్పాలి.

Advertisement
CJ Advs

ఆ చిత్రం హిట్ అవడంతో పూజ హెగ్డే దశ తిరిగింది. వరసగా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంది. ఆమె డీజే లో చేసిన గ్లామర్ షో కొన్నాళ్లపాటు పూజ హెగ్డే టాలీవుడ్ ని ఏలెలా చేసింది. ఇప్పుడు అదే మాదిరి హరీష్ శంకర్ మరో హీరోయిన్ ని టాలీవుడ్ కి దించాడు. పూజ హెగ్డే కన్నా మరింత ఆకర్షణగా, మరింత అందమైన భామని తీసుకొచ్చాడు.

రవితేజ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా హరీష్ శంకర్ భాగ్యశ్రీ బోర్సే అనే కొత్తమ్మాయిని తెచ్చాడు. మిస్టర్ బచ్చన్ సెట్స్ లోకి ఎంటర్ అయిన కొత్తల్లోనే ఆ అమ్మాయి లుక్స్ గురించి టాలీవుడ్ లో చర్చ మొదలయ్యింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ నుంచి వదిలిన సితార్ సాంగ్‌లో భాగ్యశ్రీ అందాలు ఎంతగా హైలైట్ అయ్యాయో అందరికి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చిన ప్రతి ప్రోమోలో ఆ అమ్మాయి అందాల గురించి యూత్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది.

మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే మాత్రం టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీకి భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే ని చేర్చారని వినికిడి. మరి మిస్టర్ బచ్చన్ విడుదల కాకుండా మరో ఛాన్స్ అంటే అమ్మడు లక్కీ అనే చెప్పాలిగా.. అప్పుడు పూజ లాగా ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కూడా నిలదొక్కుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. 

Then Pooja Hegde - now Bhagyashri :

Bhagyashri Borse Looks Beautiful In Ravi Teja Mr Bachchan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs