బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా స్టేటస్ ని మైంటైన్ చెయ్యడమే కాదు.. ప్రతి భాషలోనూ అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ని ప్రత్యేకించి నార్త్ ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి నిరుత్సాహ పరిచే సినిమాలొచ్చినా, మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా కళ్ళు తిరిగే కలెక్షన్స్ అందిస్తున్నారు. అంతెందుకు కల్కి చిత్రానికి మొదటిరోజు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. కల్కికి కేవలం మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది.
అయినప్పటికీ ఆ సినిమా 1000 కోట్ల క్లబ్బులో కాలు పెట్టింది. కారణం ప్రభాస్ స్టామినా. ఇప్పుడు ప్రభాస్ స్టామినాతో పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు పోటీ పడగలరా. అంటే ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్-చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. పుష్ప 1 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా సోలో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి.
వీరు నటిస్తున్న సినిమాలు వరసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ లో విడుదలవుతుంది. ఈ సినిమా కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకె .. లేదంటే మిక్స్డ్ టాక్ వస్తే.. ఎన్టీఆర్ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టగలడా, మరోపక్క అల్లు అర్జున్ పుష్ప 2 తో రాబోతున్నాడు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే పుష్ప తో నార్త్ లో 100 కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇపుడు పుష్ప 2 కి గనక మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే సినిమాని సక్సెస్ తీరానికి చేర్చగలడా..
ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య తో నిరాశ పరిచిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి డిసెంబర్ లోనే రాబోతున్నాడు. ఒకవేళ గేమ్ చేంజర్ కి అనుకూలమైన టాక్ రాకపోతే రామ్ చరణ్ తన పాన్ ఇండియా క్రేజ్ తో సినిమాని విజయతీరానికి చేరుస్తాడా.. ప్రభాస్ స్టామినాతో ఈ హీరోలు పోటీపడగలరా అనేది చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న. చూద్దాం స్టామినా ఎవ్వరికి ఎక్కువ, ఎవ్వరికి తక్కువ అనేది కాలమే నిర్ణయించాలి.