గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం కొరటాల-ఎన్టీఆర్ లతో పాటుగా సినిమాలోని కీలక నటులు దేవర పార్ట్ 1 షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈమధ్యనే హీరోయిన్ జాన్వీ కపూర్ తన పార్ట్ ఎక్కువగా దేవర సీక్వెల్ లో ఉంటుంది.. ఇందులో నా పాత్ర సముద్ర తీరాన ఆహ్లాదంగా ఆడి పాడే పాత్ర అంటూ తంగం కేరెక్టర్ సీక్రెట్స్ రివీల్ చేసింది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడంతో.. పలు భాషల నటులను ఇందులో భాగం చేస్తున్నారు కొరటాల. బాలీవుడ్ నుంచి విలన్ అలాగే హీరోయిన్ ని తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు హిందీ మార్కెట్ లో కీలకంగా ఉంటారు. తాజాగా దేవర కి నార్త్ లో మరింత వెయిట్ పెరిగేలా మరొక విలన్ ని తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రంలోకి మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఎంటర్ కాబోతున్నాడట. దేవర పార్ట్ 1 మూవీ ఎండింగ్ తో పాటు దేవర పార్ట్ 2 మెయిన్ విలన్ గా బాబీ డియోల్ ని కొరటాల శివ చూపించబోతున్నారట. బాబీ డియోల్ కేరెక్టర్ ని మాస్ గా పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తారంట. మరి ఈలెక్కన దేవర పార్ట్ 1 కన్నా ఎక్కువగా పార్ట్ 2 కే క్రేజ్ వచ్చేలా ఉంది.. ఈ న్యూస్ లు వింటుంటే..!