ఎన్నాళ్లగానో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డిసెంబర్ లో ఉంటుంది అంటూ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన భరోసాతో మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రామ్ చరణ్ ని కొత్తగా చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ పై ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
తాజాగా గేమ్ ఛేంజర్ పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే గేమ్ చెంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటపై మిక్స్డ్ టాక్ రాగా.. థమన్ ఈ సినిమాలో 7 పాటలు ఉంటాయంటూ ఆసక్తిని క్రియేట్ చేసాడు. మరి ఓ కమర్షియల్ సినిమాలో 7 సాంగ్స్ అంటే మాములు విషయం కాదు.
సాంగ్స్ అన్ని అద్భుతంగా వచ్ఛాయని.. రెండో పాట ను ఆగష్టు లో రిలీజ్ చేస్తారని థమన్ చెబుతున్నాడు. అన్ని పాటలు ఎక్సట్రార్డినరీగా అభిమానులను ఓ ఊపు ఊపేసేలా ఉండబోతున్నాయంటూ థమన్ గేమ్ ఛేంజర్ సాంగ్స్ పై ఇచ్చిన అప్ డేట్ వైరల్ గా మారింది.