హీరో రాజ్ తరుణ్ పర్సనల్ ఇస్యూస్ తోప్రస్తుతం మీడియాకి దొరకడం లేదు. ఒకవేళ బయటికొస్తే ఎక్కడ లావణ్య కేసు విషయమై అడుగుతారో అని ప్రస్తుతం రాజ్ తరుణ్ అయితే బయటికి రావట్లేదు. ఆఖరికి తాను నటించిన సినిమాని కూడా ప్రమోట్ చేయలేకపోతున్నాడు. రేపు శుక్రవారం రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు విడుదల కాబోతుంది.
ఆ సినిమా ప్రమోషన్స్ లో రాజ్ తరుణ్ లేడు. మీడియా అడిగితే ఆ సినిమా దర్శకుడు ఆయన పర్సనల్ ఇస్యూస్ తో సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు, వీడియో బైట్ వదులుతాడని ఏదో మ్యానేజ్ చేసాడు. కెరీర్ లో తప్పటడులు ఆయనని డౌన్ చేసేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ నటించిన సినిమాల్లో ఏదో ఒకటి హిట్ కంపల్సరీ.
అందుకే ఏదో విధంగా సినిమాని ప్రమోట్ చేస్తూ తనపై ఏంతో కొంత క్రేజ్ తెచ్చుకోవాల్సిన రాజ్ తరుణ్ ఇలా పర్సనల్ గొడవ వలన మీడియాని అవాయిడ్ చెయ్యాల్సి రావడం నిజంగా రాజ్ తరుణ్ దురదృష్టమే. ఆ సినిమా హిట్ అయితే ఓకె.. లేదంటే రాజ్ తరుణ్ బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుంది.
హీరో ప్రమోషన్స్ కి రాకుండానే ఒక సినిమా రిలీజ్ కి రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది రాజ్ తరుణ్ విషయంలో జరిగింది. సినిమా షూటింగ్స్ లో బిజీగా వుండి రాలేకపోవడం వేరు.. ఇలా వ్యక్తిగత కారణాలతో ప్రమోషన్స్ కి దూరమవ్వడం వేరు కదా..!