పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సౌత్ లోనే కాదు ఇండియన్ లోనే నెంబర్ 1 హీరో అనిపించుకుంటున్నారు. గూగుల్ లో టాప్ క్రేజ్ ఉన్న నటుల్లో హీరో ప్రభాస్ టాప్ చైర్ లో ఉన్నారు. కల్కి చిత్రం తో మిక్స్డ్ టాక్ తోనే 1000 కోట్ల క్లబ్బులో చేరిన ప్రభాస్ స్టామినా నార్త్ లో ఫుల్ జోష్ లో ఉంది. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోలకు కల్కి తో ప్రభాస్ చెక్ పెట్టేసారు.
ఇక ప్రభాస్ కల్కి విడుదలకు ముందే ఇటలీ వెళ్లారు, రెండు వారాలు అక్కడే గడిపి రీసెంట్ గానే హైదరాబాద్ వచ్చేసారు. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే విషయంలో అందరూ క్యూరియాసిటీతో కనిపిస్తున్నారు. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. రాజా సాబ్ తర్వాత ప్రభాస్ ఇమ్మిడియట్ గా హను రాఘవపూడి తో చెయ్యబోయే సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతారని తెలుస్తోంది. ఆ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా కనిపించడమే కాదు ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓ పూజారి కొడుకు గా ప్రభాస్ పాత్రని హను రాఘవపూడి పరిచయం చేయబోతున్నారు అని అంటున్నారు. బ్రాహ్మణ యువకుడిగా బ్రిటిష్ సైన్యంలో పని చేసే ప్రభాస్ అక్కడే ఓ యువతితో ప్రేమలో పడతాడని.. దానిని క్యూట్ లవ్ స్టోరీ గా హను చూపించబోతున్నాడట.
మరి ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ఎక్కువగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది.