ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూడగా.. కూటమి ఊహించని రీతిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనసేన 100% స్ట్రైక్ రేటు కొట్టగా.. బీజేపీ కూడా కలలో కూడా అనుకోని రీతిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. అయితే.. గెలిచిన కొద్దిరోజులకే ఓ ఎమ్మెల్యేకు ఏమైందో ఏమో తెలియట్లేదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక సొంత పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అసలు ఈయన గెలిచార్రా బాబూ..? అని బీజేపీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.
టూ మచ్ కదా..!
అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. కూటమి సర్కార్‌ను ఆకాశానికి ఎత్తాలని చూసి బొక్కా బోర్లా పడ్డారు. వైసీపీ ఓడిపోయినా సరే వదలని విష్ణు.. అసలు వైసీపీకి 40% మంది ఓట్లు అన్నం తినే ఓట్లు వేశారా..? లేక..? అని ప్రజలను హేళన చేస్తూ మాట్లాడారు. ఈయన మాట్లాడుతున్నంతసేపు సీఎం చంద్రబాబు పాటు మిగిలిన శాసన సభ్యులు పలగబడి నవ్వడం గమనార్హం. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానిస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విష్ణును ఓట్లేసి గెలిపించింది ఎవరు..? ఓటర్లు కాదా..? అనే విషయం మరిచిపోయి మాట్లాడటం గమనార్హం. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంత టూ మచ్‌గా మాట్లాడటమేంటి..? అని వైసీపీ కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు.
ఎప్పుడూ ఇంతే..!
విష్ణు కుమార్ రాజు ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో.. ఎవర్ని విమర్శిస్తారో కూడా ఎవరికీ తెలియదు..! వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీని.. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీని.. ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి ఇప్పుడు కూటమిని కూడా ఓ రేంజిలో ఎత్తాలని చూసి అడ్డంగా బుక్కయ్యారు. ఆఖరికి.. ఈ పొంతన లేని మాటలతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు వివాదాస్పద ప్రకటనలతో ఎప్పుడూ గందరగోళం సృష్టిస్తుంటారనే అపవాదు సైతం విష్ణుపై ఉంది. అయినా ఓటర్లను శంకించడం..? అవమానిస్తూ మాట్లాడటం ఎంతవరకూ సబబో ఆయనకే తెలియాలి మరి.