పవన్ కళ్యాణ్ లాంటి హైట్ ఉన్న పర్సనాలిటీ, అంతటి స్టార్ డం ఉన్న హీరోతో డాన్స్ చేసే అవకాశం దక్కడం అంటే మాములు విషయం కాదు. పవన్ పక్కన పది నిముషాలు కనిపించినా చాలు అనుకునే చాలామంది హీరోయిన్స్ ని చూసాం. ఇప్పుడు యాంకర్ కమ్ నటి అనసూయ ఆ అదృష్టాన్ని దక్కించుకుంది. గతంలో అత్తారింటికి దారేది చిత్రంలో అనసూయ ఓ సాంగ్ లో మెరిసినా అది అంతగా హైలెట్ అవ్వలేదు.
40 ప్లస్ వయసులోనూ నిగనిగలాడే అందంతో ఇప్పటికీ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా అనసూయ కిర్రాక్ బాయ్స్-కిలాడి గర్ల్స్ అనే స్టార్ మా షో లో జెడ్జ్ గా వస్తుంది. మరి గ్లామర్ అనసూయ చీర కట్టి అందాలు అలా అలా చూపిస్తేనే పడి చచ్చిపోయే వారికి.. కిర్రాక్ బాయ్స్-కిలాడి గర్ల్స్ షో లో అనసూయ చేసే గ్లామర్ రచ్చ మాములుగా లేదు. శేఖర్ మాస్టర్ తో కలిసి స్టేజ్ పై అనసూయ స్టెప్స్ వేస్తే మతిపోవాల్సిందే.
ఈ షో లో అనసూయ టెలివిజన్ స్క్రీన్‌పై ఎవరికి తెలియని విషయాన్ని చెప్పాలని ఫిక్స్ అయ్యాను. పవన్ కల్యాణ్ సార్‌తో నేను ఒక బ్యూటీఫుల్ సాంగ్ కి స్టెప్పులు వేశాను. ఆ డ్యాన్స్ నంబర్ మాత్రం టెలివిజన్ రియాలిటీ షోలో మోత మోగిపోతుంది అంటూ అతి పెద్ద సీక్రెట్ ని అనసూయ రివీల్ చేసింది. దానితో పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్, యాంకర్ శ్రీముఖి, ఆ షోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా తెల్లబోయి అనసూయ వంక చూసిన ప్రోమో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.