Advertisement
Google Ads BL

మెగా - అల్లు అనుబంధం: పదే పదే క్లారిటీ


మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ పై వచ్చిన వార్తలు సినిమా ఇండస్ట్రీలో ఏ ఫామిలీస్ మీద రావేమో.. ఆ రెండు ఫ్యామిలీల మద్యన బంధుత్వం ఉంది. ఆ బంధుత్వం వారి మద్యన ఎక్కువ ఉందా, లేదంటే తక్కువైందా అనేది వారికి బాగా తెలుసు. కానీ ఆ రెండు ఫ్యామిలీస్ విషయంలో బయటికి కనిపించే విషయాలపై మీడియా లో పదే పదే చర్చలు జరుగుతూ ఉంటారు. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు ఎన్ని గొడవలు, ఎన్ని ఈగోలు ఎలా ఉన్నా.. ఈమధ్యన రాజకీయంగా మెగా-అల్లు కుటుంబాల మద్యన పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటుంటే.. మెగా అభిమానులు, ఇంకా పవన్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్రెండ్ అంటూ నంద్యాల పోయి వైసీపీ నేతను సపోర్ట్ చెయ్యడం వాళ్ళకి సుతారామూ నచ్చలేదు. 

దానితో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు అభిమానం చంపేసుకున్నారు. ఇక మెగా-అల్లు ఫ్యామిలీస్ లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ.. బయట మాత్రం ఆ కుటుంబాల మద్యన అగాధం ఏర్పడింది అంటూ మాట్లాట్లడం దానికి పదే పదే క్లారిటీ రావడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మెగా-అల్లు విషయంలో నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు. 

ఇప్పుడు మెగా వీరాభిమాని హైపర్ ఆది మరోసారి మెగా-అల్లు వార్ పై రియాక్ట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. హైపర్ ఆది ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోల్స్ పై మాట్లాడాడు. నేషనల్ అవార్డు సాధించిన నటుడిని అవమానించడం సరికాదని, బయట అందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ లేదని, మెగా - అల్లు కుటుంబాలు రెండూ ఒకటేనని, అనవసరంగా కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అది సరికాదు, అలా చేయొద్దని హితవు పలికాడు. అసలు పవన్ కళ్యాణ్ కు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ లేవని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. 

Mega-Allu Affiliation: Repeated Clarity:

Hyper Aadi clarity about Mega-Family affiliation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs