Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో డాన్స్ అంటే అంత ఈజీ కాదు!!


గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డాన్స్ అంటే అంత ఈజీ కాదు అని ఆయన తో నటించిన ప్రతి హీరోయిన్ చెబుతూ ఉంటారు టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీరంతా డాన్స్ లో నెంబర్ వన్... అల్లు అర్జున్, చరణ్ లు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారేమో కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఆన్ సెట్స్ లో డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ చూసి ఖఠినమైన స్టెప్స్ ని కూడా అలవోకగా చేసేస్తాడు అనే మాట చాలామంది నోటి వెంట వింటూనే ఉంటాము. 

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ దేవర చిత్రానికి సంబంధించి ఓ పాట చిత్రీకరణ కంప్లీట్ చేసాడు. హీరోయిన్ జాన్వీ కపూర్ తో ఎన్టీఆర్ స్టెప్స్ వేసాడు. ఈ పాటకు సంబంధించి డాన్స్ కొరియోగ్రాఫర్ ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ బాస్కో దేవర సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేశాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ఎన్టీఆర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.

దేవరలోని ఓ సాంగ్ కోసం చాలా కష్టమైన స్టెప్పులని కూడా ఈజీగా కంపోజ్ చేసాను. ఇదంతా కేవలం ఎన్టీఆర్ వలనే సాధ్యం అయ్యింది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోతుంది. థియేటర్స్ లో ఎన్టీఆర్ డాన్స్ చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ బాస్కో చెప్పుకొచ్చారు. 

ఇక జాన్వీ కపూర్ కూడా విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లు ఇద్దరిలో ఎవరితో డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అడిగితే.. తాను ఎన్టీఆర్ తో డాన్స్ చేయడానికి ఇష్టపడతానని జాన్వీ కపూర్ చెప్పింది. ఇప్పటికే దేవర మూవీలో ఓ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేశాను.. అంటూ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో డాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. 

Dancing with NTR is not that easy!!:

Jr NTR is a fabulous dancer Choreographer Bosco Martis
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs