Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ కి వెళ్ళేది ఎప్పుడంటే..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్నారు. చిన్నపాటి షెడ్యూల్ తో పాటుగా రెండు పాటలు మాత్రం దేవర చిత్రానికి బ్యాలెన్స్ ఉండడంతో ఎన్టీఆర్ ముందుగా దేవర పార్ట్ 1 ని కంప్లీట్ చేసి కొరటాల శివ కి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అప్పగించి ఆయన ముంబై వెళ్ళిపోతారట.

Advertisement
CJ Advs

ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హిందీలోకి అడుగుపెట్టబోయే భారీ బడ్జెట్ మూవీ వార్ 2 షూటింగ్ కోసం ఇంతకుముందే ముంబై వెళ్లారు. అక్కడ ఓ లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఆగష్టు రెండో వారం నుంచి తిరిగి వార్ 2 సెట్స్ లోకి జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఆగష్టు నుంచి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వరుసగా డేట్స్ ఇస్తారని.. నవంబర్ లోపు వార్ 2లో తన పార్ట్ ను ఎన్టీఆర్ శరవేగంగా పూర్తి చేస్తారని అంటున్నారు.

ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వగానే దర్శకుడు ఆయన్ ముఖర్జీ హృతిక్ రోషన్-ఎన్టీఆర్ లపై ఇంటర్వెల్ ను షూట్ చేస్తారని సమాచారం. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లతో పాటుగా హీరోయిన్ కియారా కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ లోపాల్గొంటుంది అని చెబుతున్నారు. ఇక దేవర పార్ట్1 షూట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ వార్ 2పై ఫోకస్ పెట్టేందుకు సిద్దమవుతున్నారన్నమాట. 

When will NTR go to the sets of War 2..:

NTR gearing up to kickstart action for War 2 from this time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs