జగన్ మోహన్ రెడ్డి వైస్సార్ వారసత్వాన్ని తీసుకున్నాడు కానీ.. ఆయన చేసిన మంచి జగన్ చెయ్యలేకపోయాడు. ఆ విషయంలో వైస్సార్ కి జగన్ కి అస్సలు పోలిక లేదు.. ఇది జగన్ పెంచి పోషించిన బ్లూ మీడియా మాట్లాడుతున్న మాటలు, రాస్తున్న రాతలు. నిజమే జగన్ ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఓడించలేదు.. అహం, అతిశయం రెండు జగన్ ను ఓడించాయి. ఇది కూడా జగన్ మీడియా మాటే.
గెలవకముందు ప్రజల మనిషి, గెలిచాక అదే ప్రజలు వద్దకు వెళ్ళకుండా పాలన సాగించిన మనిషి జగన్. చంద్రబాబు 45 రోజుల పాలనలో ఎక్కువగా మీడియా ముందు, ప్రజల్లోనే ఉన్నారు. అది ఆయన రాజకీయ చాతుర్యం. జగన్ కేమి తెలుసు ఈ రాజకీయ నీతి. ఎంతవరకు తాడేపల్లిలో విశ్రాంతి తీసుకోవడమే కానీ.. మీడియాతో పని లేదు, ప్రజల వద్దకు వెళ్ళేది లేదు, వెళ్లాల్సి వస్తే తాడేపల్లి నుంచి గన్నవరానికి హెలి కాఫ్టర్, కింద నడిచేది లేదు, ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాలు కట్టాల్సిందే, ప్రజలంతా ఇబ్బందులు పాలవ్వాల్సిందే. ఇంకెందుకు ఓట్లేస్తారు వాళ్ళు.
జనం మధ్యలోకి రాకుండా అక్కా చెల్లెలు అంటే వారు దగ్గరవుతారా.. కనీసం మీడియా ముందుకు రాని నువ్వు సీఎం ఎలా అయ్యావయ్యా, వైస్సార్ ప్రజలకు మంచి చెయ్యాలని నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. ముఖ్యమంత్రి అంటే ఎన్నో రకాల పనుల్లో బిజీగా ఉంటారు. కాని నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రజల్లోకి రాకుండా, మీడియా ని పట్టించుకోకుండా ఉండిపోయావు. అదే నీ పతనానికి కారణం అంటూ బ్లూ మీడియా జగన్ ని పదే పదే విమర్శిస్తూనే ఉంది.
చంద్రబాబు ఏ తప్ప్పు చేస్తారా అని చూడకుండా వినుకొండ పర్యటనలో రోడ్డు మీద ప్రయాణం చేసినట్టుగా, అందరితో కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేసినట్టుగా ప్రజల్లోకి వస్తే మళ్ళీ అధికారానికి దగ్గరవుతావు. లేదు చంద్రబాబు పాపాలు, శాపాలు లెక్కలేస్తూ కూర్చుంటే ఎప్పటికి అలానే ఉంటావు. నువ్వు మారు, నీ పార్టీ పద్ధతి మార్చు, బూతులు మట్లాడేవాళ్ళను పక్కనపెట్టు. సలహాలిచ్చే సీనియర్స్ ను పక్కనబెట్టుకో జగన్ అంటూ బ్లూ మీడియా జగన్ కి ఎప్పటిలాగే సలహాలు పడేసింది.