రాజ్ తరుణ్-లావణ్య కేసు మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న సమయంలో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అసలే కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు A 1ముద్దాయిగా నమోదు చేసారు. ఆ కేసు విషయంలో రాజ్ తరుణ్ కోర్టుకి రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ రాజ్ తరుణ్ తనకు కోర్టుకు వచ్చేందుకు సమయం లేదు అని లాయర్ ద్వారా కోర్టుకు చెప్పాడు.
మరి కోర్టుకు రాలేని వాడు ఇప్పుడు తన సినిమాల ప్రమోషన్స్ కి వస్తాడా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. రేపు వారం రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఆ ఈవెంట్ కి రాజ్ తరుణ్ వస్తాడా అనేది సందేహమే. మరోపక్క రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి విడుదల కాబోతుంది.
తిరగబడరా సామి సినిమా హీరోయిన్ తోనే రాజ్ తరుణ్ ఎఫ్ఫైర్ నడుపుతున్నాడంటూ లావణ్య అనే యువతి ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ తిరగబడరా సామి సినిమా ని ప్రమోట్ చెయ్యాలంటే హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి మీడియా ముందుకు రావాలి. అక్కడ రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకు కేసు కి సంబందించిన ప్రశ్నలు ఎదురవ్వడం ఖాయం.
సో రాజ్ తరుణ్ అసలు మీడియా ముందుకు వస్తాడా.. కోర్టుకు రాలేని వాడు ప్రమోషన్స్ కి మాత్రం వస్తాడా.. అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.