Advertisement

నితీశ్ బ్రేకప్.. చంద్రబాబు సంగతేంటి?


నితీశ్ రెఢీ.. చంద్రబాబు సంగతేంటి?

Advertisement

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కర్త, కర్మ, క్రియ.. నితీశ్ కుమార్, నారా చంద్రబాబు నాయుడే..! ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు..! అలాంటిది ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు మద్దతు విరమించుకున్నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. కేంద్రలోని మోదీ సర్కార్  ఒక్క దెబ్బకు కుప్పకూలిపోదా! మరికొన్నిరోజుల్లో ఇంచుమించు ఇదే జరగబోతోందన్నది ఢిల్లీ వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే.. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితిశ్ కుమార్ ఇగో హర్ట్ అయ్యింది.! మోదీని ప్రధాని చేసిన నా మాటే కాదంటారా..? అంటూ బాగా ఫీలయ్యారట. అందుకే ఇక మోదీనే ఢీ కొనడానికి రెడీ అయిపోయారట. నితీశ్ సరే ఇక చంద్రబాబు సంగతేంటి..? అన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా నడుస్తున్న చర్చ.

అసలేం జరుగుతోంది..?

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వం.. ఇచ్చే ప్రసక్తే లేదు.. ఈ ఒక్క మాటతో నితిశ్‌కు కోపం నషాళానికెక్కింది..! రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నది తొలి నుంచి ఉన్న డిమాండ్. మోదీ ప్రధాని అయ్యాక ఈ రెండింటిలో ఏదో ఒక్కటి వర్కవుట్ అవుతుందని భావించి మద్దతిచ్చారు. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్.. ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొచ్చారు. దీనినికి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి బదులిస్తూ.. గతంలో కొన్ని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాను కల్పించినట్లు తెలిపారు. అయితే.. 2012 మార్చి- 30న అంతర్గత మంత్రిత్వ శాఖల బృందం ఇచ్చిన నివేదిక మేరకు ప్రత్యేకహోదాకు బిహార్ రాష్ట్రం అర్హత పొందేలేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రత్యేక హోదా పొందేందుకు ప్రత్యేకంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి వివరించారు. ఇక్కడే నితీశ్ బాగా హర్ట్ అయ్యారట. రాష్ట్రాభివృద్ధి కోసం మద్దతిస్తే.. కనీసం పట్టించుకోపోతే ఎలా..? అని ఫీలయ్యారట. మనకు ఏమీ ఇవ్వనప్పుడు.. చేయలేనప్పుడు ఇక ఎన్డీఏలో ఉండాల్సిన అవసరమేంటి..? అని పునరాలోచనలో పడ్డారట.

బాబు ఏం చేస్తారో..?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది.. కానీ ఎందుకో దీని గురించి కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతోంది టీడీపీ. చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారో ఇప్పటికీ సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి. ఆల్ పార్టీ మీటింగులో నలుగురు ఎంపీలున్న వైసీపీనే హోదా ప్రస్తావన తెస్తే.. కనీసం టీడీపీ ఎంపీలు నోటి మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. దీంతో అసలు హోదా అడిగే ఉద్దేశం ఉందో లేదో ఆయనకే తెలియాలి. ఇక అవన్నీ అటుంచితే.. రేపొద్దున ఎన్డీఏకు నితీశ్ బ్రేకప్ చెప్పేస్తే.. చంద్రబాబు ఏం చేస్తారు..? ఈయన కూడా కటీఫ్ చెబుతారా..? లేకుంటే కంటిన్యూ అవుతారా..? అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. టీడీపీ నిర్ణయం ఏమిటనేది.. నితీశ్ తీసుకునే ఆలోచనపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కచ్చితంగా ఆగస్టు సంక్షోభం ఉండొచ్చని.. మోదీ సర్కార్ కుప్పకూలిపోతోందనే చర్చ కూడా ఢిల్లీ వర్గాల్లో గట్టిగానే నడుస్తోంది. ఏమో.. ఇవన్నీ రాజకీయాలు కదా.. ఏమైనా జరగొచ్చు మరి..!

Nitish breakup.. What about Chandrababu?:

What about Nitish Ready.. Chandrababu?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement