రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ లో వినిపించని పేరు. ఇండియన్ 2 పై భారీ ఆశలు పెట్టుకుని అది సక్సెస్ అయితే సౌత్ లో బిజీ అవ్వొచ్చనుకున్న రకుల్ ని ఆ సినిమా రిజల్ట్ బాగా నిరాశపరిచింది. ఎక్కడా రకుల్ ప్రీత్ పేరు కూడా వినిపించలేదు. అయితేనేమి.. బాలీవుడ్ లో అమ్మడు బిజీ బిజీ లైఫ్ గడుపుతోంది.
రీసెంట్ గా అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో భర్త జాకీ భగ్నానీతో కలిసి సందడి చేసిన రకుల్ ప్రీత్ ఆ పెళ్ళికి రెడీ అయ్యే వీడియోస్ ని కూడా షేర్ చేసింది. చక్కటి డిజైనర్ వేర్ కాస్ట్యూమ్స్ లో రకుల్ కనిపించింది. భర్త తో కలిసి చలాకీగా కనిపించిన రకుల్ తాజాగా బెస్ట్ యాక్ట్రెస్ గా #chhatriwali కి అవార్డు అందుకుంది.
Feeling bright on winning the best actor for #chhatriwali last night!❤️❤️ thnkyouuuu for all the love !!🙏🙏 అంటూ పొంగిపోతూ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో రకుల్ ఎప్పటిలానే గ్లామర్ ని ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం రకుల్ బ్యూటిఫుల్ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.