Advertisement
Google Ads BL

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన జాన్వీ కపూర్


దేవర భామ జాన్వీ కపూర్ గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలోనే ఉంది. జాన్వీ కపూర్ ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యం తో ఆమె ముంబైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేరింది. జాన్వీ కపూర్ నిన్న శుక్రవారమే డిశ్చార్జ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆమె ఈరోజు శనివారం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యి ఇంటికి చేరింది. 

Advertisement
CJ Advs

అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి సందడి చేసిన జాన్వీ కపూర్ ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ కి గురి కావడంతో ఆసుపత్రిలో చేరింది. తండ్రి బోని కపూర్ జాన్వీ వెంటే వున్నారు. జాన్వీ కాస్త కోలుకోవడంతో ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది, కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ ఆమె కోలుకుంటుంది అని బోనీ కపూర్ ఆమెని ఇంటికి తీసుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. 

ఇక జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన పడ్డారు. కారణం దేవర కి సంబంధించి పాటలు బ్యాలెన్స్ ఉండడంతో.. జాన్వీ కపూర్ త్వరగా కోలుకోవాలని వాళ్ళు పూజలు చేసారు. మరోపక్క జాన్వీ కపూర్ ఆగష్టు కల్లా RC 16 సెట్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు జాన్వీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Janhvi discharged from the hospital:

Janhvi Kapoor is out of the hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs