కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి హత్య కేసులో A 2 నిందితుడిగా బెయిల్ కూడా లభించక పరప్పన అగ్రహార జైలులో గత నెలన్నరగా శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రియురాలు పవిత్ర గౌడ A 1 నిందితురాలిగా రేణుక స్వామి హత్య కేసులో జైలు జీవితం గడుపుతుంది. మరో 13 మంది నిందితులు ఈ కేసులో రిమాండ్ లో ఉన్నారు.
ఈ మధ్యన హీరో దర్శన్ తనకి జైలు ఫుడ్ పడక ఆరోగ్యం క్షీణిస్తుంది, అందుకే తనకి ఇంటి నుండి భోజనం తెప్పించుకునే వెసులుబాటు కల్పించాలి అంటూ కోర్టులో పిటిషన్ వేసాడు. ప్రస్తుతం దర్శన్ కస్టడీ పొడిగింపుపై వాదనలు జరుగుతుండగా.. దర్శన్ లో పశ్చాత్తాపం మొదలైంది అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అభిమాని రేణుక స్వామి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో సమస్యల్లో ఉంది అని.. రేణుక స్వామి కుటుంబానికి దర్శన్ ఏదైనా సాయం చెయ్యాలనుకుంటున్నట్లుగా ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రేణుక స్వామి ఆటో నడుపుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు, ఇప్పుడు అతను లేక అతని ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవడంతో దర్శన్ ఆ ఫ్యామిలీకి డబ్బు రూపేణా సహాయం చేయాలనుకుంటున్నాడు.. అంతేకాకుండా జైల్లో కూడా అతను పశ్చాత్తాప పడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడని జైలు అధికారులు కూడా చెప్పడం గమనార్హం.