Advertisement
Google Ads BL

భార్యతో కలిసి పవన్ ఎక్కడికెళ్లారో తెలుసా ?


జూన్ 12 న ఏపీ డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తాను చేపట్టిన శాఖలలో కార్యసాధకుడిలా మారిపోయి ప్రజల కోసం పని చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ.. అధికారులను పరిగెత్తిస్తూ తాను కూడా పరుగులు పెడుతూ నిత్యం హడావిడిగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మధ్యలో వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టారు. రీసెంట్ గానే అమ్మవారి దీక్ష విరమించారు.

Advertisement
CJ Advs

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి భార్య అన్నా లెజినోవా తో కలిసి విదేశాలకు వెళ్ళారు. అటు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. పవన్ ఢిల్లీ కి వెళ్ళలేదు, చంద్రబాబు పవన్ ను అవాయిడ్ చేస్తున్నారని అప్పుడే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో నెత్తినోరు కొట్టుకుంటూ వారి మద్య స్పేస్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. అయితే బ్లూ మీడియా కూడా పవన్ ఎక్కడికి వెళ్లారో తెలియక తికమక పడుతుంది. 

పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్య అన్న లెజెనోవా తో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందడంతో పవన్ కళ్యాణ్ భార్యతో సహా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సో పవన్ వెళ్ళింది వెకేషన్ కోసం కాదు. భార్య అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా కోసం ఆయన సింగపూర్ వెళ్ళారన్నమాట.

Do you know where Pawan went with his wife?:

Why Did Pawan Kalyan Go To Singapore?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs