కల్కి 2898 AD మూవీ విడుదలకు నాలుగు రోజుల ముందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటలీ వెకేషన్ కి వెళ్లిపోయారు. అక్కడే కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేసిన ప్రభాస్ ఇటలీ నుంచి హైదెరాబాద్ కి తిరిగొచ్చేశారు. దాంతో ప్రభాస్.. ఇటలీ వెకేషన్ ఫినిష్ వాట్ నెక్స్ట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
అంటే కల్కి తర్వాత ప్రభాస్ ఇమ్మిడియట్ గా రాజా సాబ్ షూటింగ్ లో జాయిన్ అవుతారనుకుంటే ఆయన ముందు వెకేషన్ కి వెళ్లారు. వచ్చాక మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సెట్స్ లోకి వెళతారని ఊహిస్తున్నారు. మారుతి కూడా ప్రభాస్ డేట్స్ ని బట్టి ప్రభాస్ తో పనిలేని సన్నివేశాల చిత్రీకరణ చేసుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ ఉంటేనే పని జరుగుద్ది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో రాజా సాబ్ షూటింగ్ ఎక్కువ శాతం చిత్రీకరిస్తున్నారు. ఇపటికే హీరోయిన్స్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మారుతి.. ప్రభాస్-హీరోయిన్స్ మధ్యలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలాగూ కల్కి 2, సలార్ 2, హను తో చెయ్యబోయే కి సినిమాకి ఇంకాస్త సమయం ఉండడంతో ప్రభాస్ ముందుగా రాజా సాబ్ సెట్స్ లోకి వస్తారని మారుతి అనుకుంటున్నారు. చూద్దాం ప్రభాస్ ప్లానింగ్ ఎలా ఉందొ.!