ఐదేళ్ల క్రితం ప్రజల మధ్య నుంచి పవర్ లోకి వచ్చి గత ఐదేళ్ళగా తాడేపల్లి ప్యాలెస్ లో సేద తీరుతూ అప్పుడప్పుడు బటన్ నొక్కుతూ బటన్ ముఖ్యమంత్రిగా ఫేమస్ అయిన వైస్ జగన్ మోహన్ రెడ్డిని అదే ప్రజలు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం చేసారు. ప్రజలు మధ్యలోనే తిరిగిన సీఎం గా అధికార పీఠమెక్కిన జగన్ ఆ తర్వాత ప్రజలు ను పట్టించుకోవడం కానీ వారి మధ్యలోకి వెళ్లడం కానీ గత ఐదేళ్లుగా చెయ్యలేదు.
కాబట్టే ప్రజలు మాజీ ని చేసి ఇంటికి పరిమితం చేసారు. ఓడిపోయాక కూడా జగన్ పై పదే పదే అదే విమర్శలొచ్చాయి. ఇక ఓడిపోయాక కూడా కామ్ గా తాడేపల్లి టు బెంగుళూరు ప్యాలెస్ తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి కి బ్లూ మీడియా హెచ్చరికలు చేస్తుంది.. అలాగే జగన్ ఇమ్మిడియట్ గా చెయ్యాల్సిన బాద్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది.
దానితో మేలుకున్న జగన్ నిన్న వినుకొండ ఘటనతో ప్రజల్లోకి రావడమే కాకుండా.. ఇప్పుడు ఇదే ఘటనపై ఢిల్లీలో ధర్నాకు ప్లాన్ చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. జగన్ హయాంలో వినుకొండ ఘటనలు ఎన్నో జరిగాయి. అదే ఘటనను పట్టుకుని జగన్ ప్రజల్లోకి రావడంతో వైసీపీ కార్యకర్తలుకు ఉత్సాహపడుతున్నారు. ఐదేళ్లుగా రాని మైలేజ్ నిన్న వినుకొండ ఘటనతో వచ్చింది అని సంబరపడుతుంది వైసీపీ కేడర్.
అది చూసిన చాలామంది జగన్ కి ఓటమి నేర్పిన పాఠం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ లెక్కన జగన్ దూసుకుపోతే అసెంబ్లీలో కూటమితో పోరాడితే మళ్ళీ పైకి లేచినట్టే అంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.