నిన్న జగన్ వినుకొండ లో వైసీపీ కార్యకర్త హత్య ఉదంతంలో అతని ఫ్యామిలీ పరామర్శకు కోసం వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ కాన్వాయ్ బయలు దేరగానే జనాలు కోకొల్లలుగా జగన్ కాన్వాయ్ ని చుట్టేశారు. జగన్ పై ఎంత ప్రేమ, ఎంత అభిమానమో అంటూ జగన్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. జననేత కోసం జనం. 144 సెక్షన్స్ పెట్టి బండ్లు ఆపినంత మాత్రాన గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఆపలేరు..
ఇంత మంది పోలీసుల్లో కూడా బండికి జండా కట్టుకున్న మగాడు.. నీ కోసం దేనికైనా సిద్ధం అన్నా.. వర్షాన్ని సైతం లెక్కచేయని అభిమానం. వినుకొండకి వెళ్తూ దారి మధ్యలో చిలకలూరిపేట వద్ద జగన్ వాహనం ఆపి భారీగా తరలివచ్చిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకి అభివాదం చేసిన జగన్.. నువ్వు దేవుడివన్నా.. గుంటూరులో రోడ్డుకు ఇరువైపులా భారీగా ప్రజలు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు చేరుకుని
జగన్ గారికి ఘన స్వాగతం పలికారు. అంతులేని అభిమానం.. అంటూ వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ హడావిడి చేస్తుంది.
అది చూసిన నెటిజెన్స్ ఏంటి జగన్ నీ చుట్టూ జనాన్ని చూసి సంబరపడిపోతున్నావా.. నీ మీద అంత అభిమానమే ఉంటే.. నువ్వెందుకు ఓడిపోయావు. జగనన్నా అంటూ కెమెరాల ముందే నీ మీద అభిమానం, అది ఓటేసేందుకు లేదు. వీళ్లను అస్సలు నమ్మకూడదు. గత ఎలక్షన్లో కూడా జనాలు ఇలానే మైమరపించారు జగన్ సర్. ప్రజలు స్వార్థంతో రాజకీయ నాయకులు కంటే బాగా ముదురుపోయారు అంటూ కొంతమంది జగన్ కి సలహాలిస్తున్నారు.