Advertisement
Google Ads BL

ప్రణీత్ హనుమంతు పై డ్రగ్స్ కేసు !!


యుట్యూబర్ ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నాడు. సోషల్ మీడియాలో తండ్రి-కూతురు బంధంపై నీచమైన కామెంట్స్ చేసిన ప్రణీత్ హనుమంతు ను అరెస్ట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన ఉద్యమంతో ప్రణీత్ జైలుకెళ్లాడు. అతను తండ్రి-కూతురు పై అసభ్యంగా మాట్లాడినందుకు, అనుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశాను అంటూ క్షమాపణలు కూడా చెప్పాడు. 

Advertisement
CJ Advs

అయినప్పటికీ తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బెంగుళూరులో ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి చంచల్ గూడా జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ప్రణీత్ ని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలియడంతో అతనిపై మరో కేసు నమోదైంది. 

పోలీసుల విచార‌ణ‌లో ప్ర‌ణీత్ హ‌నుమంతు గంజాయి, డ్ర‌గ్స్ సేవించిన‌ట్లు తేలడంతో మరో కేసును న‌మోదు చేశారు పోలీసులు. రిమాండ్ లో ఉన్న ప్రణీత్ హ‌నుమంతును మూడు రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిష‌న్ వేశారు.

Drugs Case Filed Against Praneeth Hanumanthu:

YouTuber Praneeth Hanumanthu booked for consuming drugs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs