Advertisement
Google Ads BL

ఏమి పట్టనట్టు వెకేషన్ లో అల్లు అర్జున్


ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప ద రూల్ సెట్స్ లో ఏదో జరిగింది, హీరోకి దర్శకుడుకి మధ్యన ఈగో ప్రోబ్లెంస్, అందుకే పుష్ప 2 డిసెంబెర్ నుంచి కూడా పోస్టు పోన్ అవ్వబోతుంది అంటూ ఇష్టమొచ్చినట్టుగా రూమర్స్ ప్రచారం లోకి వచ్చేసాయి. సుకుమార్, అల్లు అర్జున్ విడివిడిగా విదేశాలకు వెళ్లారనే న్యూస్ కూడా హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అంతే కాదు అల్లు అర్జున్ గత నాలుగేళ్ళుగా పుష్ప రాజ్ కేరెక్టర్ కోసం పెంచిన గెడ్డాన్ని కూడా ట్రిమ్ చేసేసాడంటూ అబ్బో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇక్కడ ఇంత హంగామా జరుగుతుంటే అల్లు అర్జున్ మాత్రం ఏమి పట్టనట్టుగా భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతోంది. 

ఈ సమయంలో అల్లు అర్జున్ ఇలా చేస్తున్నాడేమిటో అంటూ ఫ్యాన్స్ అల్లు అర్జున్ విషయంలో బయటికి చెప్పుకోలేక లోలోపల గుసగుససలాడుకుంటున్నారు. పుష్ప 2 సెట్స్ లో ఏమి జరగలేదు, అనుకున్నట్టుగానే సినిమా డిసెంబర్ కి వస్తుంది అని హామీ ఇవ్వకుండా ఈ కన్ఫ్యూషన్ ఇలా వదిలేసి అలా వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం ఏమిటో అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి పుష్ప 2 రూమర్స్ కి పుష్ప టీమ్ చెక్ ఎప్పుడు పెడుతుందో చూద్దాం.!

Allu Arjun is on vacation like no matter what:

Allu Arjun vacation to Spain worries the fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs