Advertisement
Google Ads BL

రోజా మీద పగబట్టేసారు


ఏపీ మాజీ మినిస్టర్, మాజీ ఎమ్యెల్యే రోజాపై జబర్దస్త్ కమెడియన్స్ పగబట్టేసారు. కాదు కాదు నెటిజెన్స్ పగబట్టారు. ఏపీ లో జగన్ మోహన్ రెడ్డి చెల్లెలిగా, రోజా రెడ్డి జగన్ ని ఎత్తేసే క్రమంలో ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని.. జగన్ ని మచ్చిక చేసుకుని మినిస్టర్ అయ్యాక నగరిలో వైసీపీ కార్యకర్తలు పట్ల ఆమె వ్యవహరించిన తీరుతో సొంత పార్టీ వారే రోజని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. 

Advertisement
CJ Advs

మరోపక్క ఏపీ అసెంబ్లీలో రోజా వెకిలి చేష్టలతో జగనన్న.. జగన్న నీకు సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఆమె వైపు తిరిగి ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉన్న వీడియో ని చూపిస్తూ జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ ఎలక్షన్ మూమెంట్ లో రోజా హావ భావాలతో మీడియా ముందు కామెడీ చేసిన సందర్భాలున్నాయి. 

కట్ చేస్తే 2024 ఎన్నికల్లో రోజా ఓడిపోయి ఇంట్లో కూర్చుంది. మరోపక్క తనని దేవతలా భావించిన జబర్దస్త్ కమెడియన్స్ పై నోరు పారేసుకుంది. ఆ కమెడియన్స్ ఎదురు తిరిగారు. ఆఖరికి రోజాపై జబర్దస్త్ స్టేజ్ పై, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై పేరడీలు చేసేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో పొట్టి నరేష్‌తో కలిసి హైపర్ ఆది ఓ స్కిట్ చేశాడు ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నార్రా అని నరేష్ ని ఆది అడుగుతాడు. నీ గురించా అంటూ నరేష్ బదులిస్తూ.. ఆది అన్నా, ఆది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా అని రోజాను కిరాక్ ఆర్పీ వెక్కిరంచిన విధంగా ఆన్సర్ ఇస్తాడు. 

ఇప్పుడు ఆది, నరేష్ వీడియో ని నెటిజెన్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రోజాని ఓ ఆట ఆడుకుంటున్నారు. అది చూసిన చాలామంది అయ్యో పాపం రోజా పై అంతగా పగపెట్టేశారేమిటి అంటూ మాట్లాడుకుంటున్నారు. 

They took revenge on Roja:

Hyper Aadi Back To Back Punches on Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs