పుష్ప2 డిసెంబర్ బరి నుంచి అవుట్.. అందుకే మంచు విష్ణు డేర్ చేస్తూ కన్నప్ప ని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించేశాడు.. అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చేసాయి. పుష్ప ద రూల్ డిసెంబర్ 6 కి రాకపోబట్టే మంచు విష్ణు అంత ధైర్యంగా డిసెంబర్ ని ఎంచుకున్నాడంటున్నారు.
అసలైతే దసరాకి కన్నప్ప రిలీజ్ అన్న మంచు విష్ణు ఇపుడు పుష్ప డిసెంబర్ బరి నుంచి తప్పుకోవడంతో కన్నప్ప ని డిసెంబెర్ లో ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి అందరూ గుసగుసలాడుకుంటున్నట్టుగానే పుష్టపు 2 సెట్స్ లో ఏదో జరిగింది. అల్లు అర్జున్ గెడ్డం తియ్యడం వెనుక, సుకుమార్ విదేశాలకు వెళ్లడం వెనుక బలమైన కారణం ఉంది.
దానితో పుష్ప 2 ని డిసెంబర్లో రిలీజ్ చేయలేమని మేకర్స్ భావిస్తున్నారు. దానికి తగ్గ లీకులు సోషల్ మీడియాలో ఇప్పించడంతోనే మంచు విష్ణు తన పాన్ ఇండియా మూవీని డిసెంబర్ కి దించే ప్లాన్ చేసాడేమో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.